నందికొట్కూరు. అక్టోబర్ 23
జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారని, పంట చేతికి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గత నెల రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం తగదని హితవు పలికారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే సిపిఐ పార్టీీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతులతో కలిసి
ఆమరణ దీక్షకు దిగుతామని సిపిఐ జిల్లా నాయకులు రఘురాం మూర్తి, సిపిఐ కార్యదర్శి ఎం. రమేష్ బాబు హెచ్చరిక చేశారు. ఆదివారం స్థానిక మార్క్ఫెడ్ కార్యాలయం దగ్గర రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా శివ రామ కృష్ణ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజులుగా సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని మండల కేంద్రాల్లో శాంతియుతంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆందోళన చేశామని అధికారులు పట్టించుకోకపోవడం తగదన్నారు. ఇప్పటికే నందికొట్కూరు శాసనసభ్యులు ఆర్థర్ కు విన్నవించిన పరిష్కరించకపోవడం తో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వారు అన్నారు. రైతు పంట సాగు చేసే సమయంలో ఎరువుల ధరలు, కూలీల రేట్లు, గుత్త రేట్లు అనేకంగా పెరిగి కష్టనష్టాలతో పంట సాగు చేశారని తీరా పంట చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం తో దళారీ బారిన పడి దారుణంగా నష్టపోతున్నారన్నారు.. రైతులు గత సంవత్సరం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకున్నారని అదే ఆశతో ఎదురు చూస్తున్నారని వారన్నారు. మొక్కజొన్న క్వింటం ధర పెరిగిన ధరలకు అనుగుణంగా రూ, 2200 అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందికొట్కూరు నియోజక వర్గంలో ఆరు మండల కేంద్రంలో మరో రెండు రోజుల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఆమరణ దీక్షకు పూనుకుటామని వారు అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. కలెక్టర్ ,ఎమ్మెల్యే ,నందికొట్కూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు కే శ్రీనివాసులు, ఎం శ్రీనివాసులు, అనీల్, రైతులు రాముడు, సుంకన్న రైతులు పాల్గొన్నారు.