Home తెలంగాణ ప్రశాంతంగా ప్రారంభమయిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

ప్రశాంతంగా ప్రారంభమయిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

141
0

హైదరాబాద్‌ అక్టోబర్ 25
ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా గతేడాది ఇంటర్‌ పరీక్షలు జరగని విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫస్టియర్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,769 పరీక్ష కేంద్రాల్లో 4,59,228 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రానికి వచ్చిన ప్రతి విద్యార్థికి థర్మల్‌ స్క్రీనింగ్‌, హాండ్‌ శానిటైజేషన్‌ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించారు. నేడు జరుగుతున్న సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు సెట్‌-ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు.

Previous articleయాద్గార్‌ప‌ల్లి వ‌ద్ద రోడ్డుప్ర‌మాదం.. అక్క‌డిక‌క్క‌డే ముగ్గురు మృతి
Next articleన్ని రంగాల్లో తెలంగాణ ప్ర‌భుత్వం స‌ఫ‌లీకృత‌మ‌వుతుంది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీ పెట్టమని కోరుతున్నారు టీఆర్ఎస్ ప్లీన‌రీ అధ్య‌క్షోప‌న్యాసంలో సీఎం కేసీఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here