హైదరాబాద్ నవంబర్ 3
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఎన్నిక ఫలితంపై చర్చించేందుకుగాను బుధవాంర గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. నాలుగు గంటలకు పైగా సమావేశం కొనసాగింది.ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓటమికి నేనే బాధ్యత వహిస్తా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జానారెడ్డి తప్పు పట్టారు. ‘‘నువ్వు ఒక్కడివే బాధ్యుడివి ఎలా అవుతావు’’ అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ‘‘నేను చెప్పేది చెప్పనిస్తే ఉంటా… లేదంటే సంతకం పెట్టి వెళ్ళిపోతా’’నంటూ జానారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.ఓటమికి సమిష్టి బాధ్యత ఉంటుంది కానీ.. ఒక్కడి బాధ్యతే ఉండదన్నారు జానారెడ్డి. రేణుకా చౌదరి జానారెడ్డి వ్యాఖ్యలకు మద్దతు పలికారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీది బ్యాడ్ షో అని ఉత్తమ్, వీహెచ్, మదు యాష్కీ తెలిపారు. ఇప్పటికే మళ్లీ మీడియాతో మాట్లాడను అని జగ్గారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
ఓటమి కి గల కారణాలు తెలుసుకునేందుకు కమిటీ
షబ్బీర్‌అలీరెండు రోజుల పాటు మెంబర్ షిప్ డ్రైవ్‌పై శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాం.. నవంబర్ 14 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ లీడర్ల పాదయాత్ర చేస్తారని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి గల కారణాలను సమీక్షించుకున్నాం. హుజూరాబాద్ ఎన్నిక పార్టీల మధ్య జరగలేదు.కేసీఆర్, ఈటల మధ్య జరిగిన ఫైట్ అన్నారు.
‘‘టీఆర్ఎస్, బీజేపీలు 6 నుంచి 10 వేలు పెట్టి ఓక్కో ఓటు కొన్నారు. ఈటల రాజెందర్ ఎక్కడ తాను బీజేపీ అని చెప్పలేదు. ఓటమి కి గల కారణాలు తెలుసుకునేందుకు ఓ కమిటీ వేస్తాం’’ అని షబ్బీర్ అలీ తెలిపారు.