Home తెలంగాణ హుజూరాబాద్‌లో కేసీఆర్ సభ లేనట్లేనా?

హుజూరాబాద్‌లో కేసీఆర్ సభ లేనట్లేనా?

100
0

హైదరాబాద్ అక్టోబర్ 21
అక్టోబర్ 30న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. అందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈటల కోసం బీజేపీ నాయకులు బరిలో దిగినా.. నియోజకవర్గంలో తన సొంత ఇమేజ్‌నే నమ్ముకున్న ఈటల ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.  మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయం కోసం కృషి చేస్తున్న హరీష్ నియోజకవర్గంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడూ కేసీఆర్‌కు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్‌లో కేసీఆర్ సభ ఉంటుందా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
తాజాగా తాను హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని స్పష్టం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం కేసీఆర్ సభ ఉంటుందా? లేదా? అనే విషయంపై మాత్రం మాట దాటవేశారు. ఇంకా షెడ్యూలు ఖరారు కాలేదని ఆ సభ గురించి ఇప్పుడే ఏం చెప్పలేనని తెలిపారు. దీంతో కేసీఆర్ సభపై జోరుగా చర్చ సాగుతోంది.  మరోవైపు కరోనా నిబంధనల దృష్ట్యా హుజూరాబాద్‌లో కేవలం వెయ్యిమందితో మాత్రమే సభలు సమావేశాలు పెట్టుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభ అంటే జనాలను భారీగా సమీకరించాల్సి ఉంటుంది. అందుకే హుజూరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనే కేసీఆర్ సభ నిర్వహించాల్సి ఉంటుంది. లేదా ఎన్నికల సంఘానికి విజ్ణప్తి చేసి సభ కోసం ప్రత్యేక అనుమతి తెచ్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.మరోవైపు కేసీఆర్ సభపై టీఆర్ఎస్ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి.  నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ రెండు సభల్లో పాల్గొనడం వల్లే పార్టీకి అక్కడ అనుకూల ఫలితం దక్కింది. బీజేపీ గెలిచిన దుబ్బాక ఉప ఎన్నికలోనూ కేసీఆర్ సభ ఏర్పాటు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చర్చ కూడా సాగుతోంది. సాగర్ తరహాలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు దళిత బంధు పథకం ప్రారంభం కోసం సీఎం కేసీఆర్ సభ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు మరో సారి సభ నిర్వహించాలని టీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నాయి. తన పార్టీ నుంచే బయటకు వెళ్లి తనకే సవాలు విసురుతున్న ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా ఓడించి ఆయనకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.  ఈ ఉప ఎన్నికలో పార్టీని గెలిపించే బాధ్యతను తన మేనళ్లుడు హరీశ్ రావు భుజాలపై మోపిన కేసీఆర్.. అందుకు అవసరమైన వ్యూహాలను తెరవెనక నుంచి అమలు చేస్తున్నారు. అక్కడి ప్రజలను టీఆర్ఎస్ వైపు ఆకట్టుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు గట్టి పోటీనిచ్చే నేపథ్యంలో.. కేసీఆర్ సభ ఏర్పాటు చేస్తే పార్టీకి కలిసి వస్తుందని అనుకుంటున్నారు. మరి హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ సభ ఉంటుందా? లేదా? అన్నది రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది.

Previous articleవైద్యరంగంలో మరో అద్భుతం పంది కిడ్నీ ని మనిషికి అమర్చిన వైద్యులు
Next articleషర్మిల పాదయాత్ర కలిసి వచ్చేనా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here