కరీంనగర్
గ్రామీణ ప్రాంతాల్లో మస్జిద్ లలో పని చేస్తున్న ఇమామ్ లు పిల్లలకు ఇస్లామిక్ విద్యను..సాంప్రదాయ పద్దతులను గ్రామాల్లో ముస్లింలు ఆచరించే విధంగా.. బాధ్యతాయుతంగా సేవలను అందించాలని జమియతుల్ హుఫ్ఫాజ్ కరీంనగర్ ఉపాధ్యక్షుడు
హాఫిజ్ జియాఉల్లాహ్ ఖాన్ పిలుపునిచ్చారు. గురువారం నాకా చౌరస్తాలో జమియత్-ఉల్-హుఫ్ఫాజ్ కార్యాలయంలో..హాఫిజ్ వసిముద్దీన్ పర్యవేక్షణలో నెలవారి సమావేశం జరిగింది. ఈసందర్భంగా జియాఉల్లాహ్ ఖాన్, వసిముద్దీన్ లు
మాట్లాడుతూ మస్జిదుల్లో పని చేసే ఇమామ్ లు ముస్లిం బాల బాలికలకు ఇస్లామిక్ విద్యను రోజు గంట పాటు బోధించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇస్లామిక్ సాంప్రదాయాలు, సంస్కృతిని పెంపొందించడానికి అరబ్బీ విద్య
దోహదపడుతుందన్నారు. రాబోయే తరాలకు ఇస్లామీయ విద్య ను విధిగా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాబోయే తరాలను నేటి సమాజంలో జరుగుతున్న అసమాన్య రుగ్మతలను నిరోధించగలమన్నారు. ఈకార్యక్రమంలో హాఫిజ్
రిజ్వాన్, కోశాధికారి మౌజ్జమ్ హుస్సేన్ ఫైజి, ఫరీదుద్దీన్ అంజత్, ముఫ్తి షాదాబ్ తఖి, అహ్మద్, జకీ తదితరులు ఉన్నారు.