Home ఆంధ్రప్రదేశ్ టిటిడి పాఠ‌శాల‌లకు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్‌ – ఈవో చేతుల‌మీదుగా ప్ర‌ధానోపాధ్యాయుల‌కు అందించిన ఐఎస్ఓ...

టిటిడి పాఠ‌శాల‌లకు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్‌ – ఈవో చేతుల‌మీదుగా ప్ర‌ధానోపాధ్యాయుల‌కు అందించిన ఐఎస్ఓ బృందం

111
0

తిరుపతి,మా ప్రతినిధి,అక్టోబర్ 04,
టిటిడి నిర్వ‌హ‌ణ‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ ప‌ద్మావ‌తి ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ గోవింద‌రాజ స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ కోదండ‌రామ‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, ఎస్వీ ఒరియంట‌ల్ ఉన్న‌త పాఠ‌శాల‌, ఎస్వీ బ‌ధిర పాఠ‌శాల‌, ఎస్వీ సంగీత‌, నృత్య పాఠ‌శాల‌, ఎస్వీ నాద‌స్వ‌రం పాఠ‌శాల‌, తాటితోపులోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, తిరుమ‌ల‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌కు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్ల‌ను సోమ‌వారం ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చాంబ‌ర్‌లో ఆయ‌న చేతుల మీదుగా క‌మిటీ స‌భ్యులు ఆయా పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపాధ్యాయుల‌కు అందించారు.

టిటిడి పాఠ‌శాల‌లో డాక్యుమెంట్ల నిర్వ‌హ‌ణ‌, ఉత్త‌మ మౌళిక స‌దుపాయాలు, విద్యార్థుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌, ఆహార పంపిణీ, ఆపరేటింగ్ విధానం(ఎస్ఓపి), ఉత్త‌మ విద్యా ప్ర‌మాణాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఐఎస్ఓ-9001 స‌ర్టిఫికెట్ల‌ను అందించారు.

టిటిడి పాఠ‌శాల‌ల్లో భౌతిక దూరం, శుభ్ర‌త, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, కోవిడ్ – 19 నిబంధ‌న‌ల బాగా పాటించినందుకు గుడ్‌ హైజెనిక్ ప్రాక్టీస్ (జిహెచ్‌పి) స‌ర్టిఫికెట్ల‌ను అందించారు.

Previous articleద‌ర్శ‌న టికెట్లు ఉంటేనే తిరుమ‌ల‌కు అనుమ‌తి – కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి
Next articleబీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల మెరుపు ముట్టడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here