నెల్లూరు
సమాజానికి సేవ చేయడం ఒక అదృష్టమని కస్టమ్స్
డిప్యూటీ కమిషనర్ ఉషాకిరణ్ రాయ్ పేర్కొన్నారు. శనివారం ది చైల్డ్ షఫర్డ్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో ధనవంతులు ఎందరో ఉన్నారని ,కానీ సమాజానికి సేవ చేసేవారు కొందరు మాత్రమే ఉంటారన్నారు . స్థానిక టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు నూర్జహాన్బేగం మాట్లాడుతూ అనాధలను ఆదరించి, అందరికీ విద్యాబుద్ధులు చెప్పించె అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .సమాజంలో ఎందరో తల్లిదండ్రులు లేని వారు ఉన్నారని వారందరినీ ఆదరించవలసిన అవసరం ఉందన్నారు .ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు అడ్వకేట్ ఉమాదేవి రూ రాడ్స్ చైర్మన్ రసూల్ , ప్రముఖ మోటివేటర్ గీతా, విశ్రాంత పోలీసు అధికారి అమీరుద్దీన్ , గౌతమబుద్ధ వాకర్స్ అసోసియేషన్ కోశాధికారి రామ్మోహన్ లను ఘనంగా సన్మానించరు.ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాశ్ అధ్యక్షత వహించారు .ఈ సమావేశంలో నారాయణ దంత కళాశాల హెచ్ఓడీ డాక్టర్ కన్నన్ ఎన్వైకే కోఆర్డినేటర్ మహేందర్రెడ్డి , పి ఎం పి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ . అడ్వకేట్ రమాదేవి ఎన్. బలరామ్నాయుడు , అడ్వకేట్ షహనాజ్ బేగం సీనియర్ జర్నలిస్టు టి.రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు