వాతావరణ శాఖ ప్రకటించిన విధంగానే హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, సరూర్‌నగర్, చంపాపేట, సైదాబాద్, బేగంబజార్, నాంపల్లి, కోఠి, బషీర్‌బాగ్, సికింద్రాబాద్, ప్యారడైజ్, ఆల్వాల్, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ధూల్‌పేట, పురాన్‌పూల్, జియాగూడ, చైత్యనపురి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది.
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం నుంచి ప్రజలు తేరుకోకముందే మళ్లీ వర్షం మొదలవ్వడం నగరవాసులను కలవరపెడుతోంది.
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని తెలిపారు. సహాయం కోసం కంట్రోల్ రూంను సంప్రదించవచ్చని వివరించింది. కంట్రోల్ రూం నెంబర్ 040 2111 1111ను సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.