Home తెలంగాణ ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఉండడం దేవరకద్ర ప్రజల అదృష్టం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి...

ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఉండడం దేవరకద్ర ప్రజల అదృష్టం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురిపించిన మంత్రి తలసాని

196
0

మహబూబ్ నగర్’ సెప్టెంబర్ 21
నిరంతరం ప్రజల కోసం తపించే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉండడం దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమని రాష్ట్ర పశుసంవర్ధక మరియు మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించారు. 2014 మందు దేవరకద్ర నియోజకవర్గం బీడు భూముల తో నిండి ఉండేదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎన్నికైన వెంటనే సీఎం కేసీఆర్ తో చర్చించి ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం గలగలపారే నీటి సెలయేళ్ళు చెక్డ్యాంలు పచ్చని పంటలతో కలకలలాడే విధంగా కృషి చేసిన ఘనత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కి దక్కిందని ఆయన కొనియాడారు. సాధారణంగా ఎమ్మెల్యేలు హైదరాబాదులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారని కానీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాత్రం నియోజకవర్గంలోనే ఎక్కువ గడుపుతూ ప్రజల ప్రజల మధ్యనే నిత్యం ఉంటారని ఆయన మనస్ఫూర్తిగా ప్రశంసలు అందించారు.  కొత్తకోట,పెబ్బేరు తదితర ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడా చూసిన ధాన్యాపు సిరులు, మత్స్య సంపద కళ్ళ ముందు కనబడుతుందన్నారు.
మత్స్య సంపద పెరగడంతో మత్స్య కారులకు ఆదాయం తో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతుందని, చేపలంటే కోస్తా ప్రాంతం దిగుమతి చేసుకుంటారు అనే భావన ఉండేదని సీఎం ప్రత్యేక చొరవతో 7 ఏండ్లకు ముందు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి.. చేపలను ఉత్తర భారతంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని అన్నారు. గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ అవకాశాన్ని మత్స్య కారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కొత్తకోట మండలం కానయపల్లి గ్రామం శంకరసముద్రం. చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు. మాట్లాడుతూ…..మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు అని అన్నారు.ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో స్వరాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపారు అని అన్నారు.
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  మాట్లాడుతు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే తెలంగాణలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారు అని ఆయన తెలిపారు.సీఎం కేసిఆర్ ప్రత్యేక చొరవతో గుక్కెడు మంచి నీళ్ళ కోసం గోస పడ్డ ప్రాంతం ఇప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుంది అని ఆయన అన్నారు.తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా, ధాన్యపు భాండాగారంగా భాసిల్లుతోంది అని అన్నారు.
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి  మాట్లాడుతు
తెలంగాణలో ఎక్కడా చూసిన ధాన్యాపు సిరులు, మత్స్య సంపద కళ్ళ ముందు కనబడుతుంది అని ఆయన తెలిపారు.మత్స్య సంపద పెరగడంతో మత్స్య కారులకు ఆదాయం తో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతుంది అని అన్నారు.చేపలంటే కోస్తా ప్రాంతం దిగుమతి చేసుకుంటారు అనే భావన ఉండేది అని,సీఎం ప్రత్యేక చొరవతో 7 ఏండ్లకు ముందు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి.. చేపలను ఉత్తర భారతంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉంది అని ఆయన తెలిపారు.ఈ అవకాశాన్ని మత్స్య కారులు సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి గారు. జడ్పీ వైస్ చైర్మన్ గుండ్రాతి వామన్ గౌడ్ గారు. కొత్తకోట మున్సిపాల్ చైర్మన్ పొగాకు సుకేశిని విశ్వేశ్వర్  ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ కొట్టం వంశీధర్ రెడ్డి . సిడిసి చైర్మన్ బీసం చెన్నకేశవ రెడ్డి మార్కెట్ చైర్మన్ సాక బాలనారయణ  సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్  ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్ . మండల రైతు కోఆర్డినేటర్ గిన్నె కొండ రెడ్డి. మత్స్యకారుల సంఘం అధ్యక్షులు సంధ రంగస్వామి. మాజి చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి . మండల ప్రధాన కార్యదర్శి అమ్మపల్లి బాలకృష్ణ కౌన్సిలర్లు హోటల్ రాములు యాదవ్. చింతలపల్లి సంధ్య రవిందర్ రెడ్డి కోఆప్షన్ సభ్యులు వసీం హనుమంతు యాదవ్. సత్యం యాదవ్. పోతులపల్లి వినోద్ సాగర్. వికాష్. కిరణ్. నరసింహ గౌడ్. నవీన్. సర్పంచులు. ఎంపీటీసిలు గ్రామ అధ్యక్షల. మత్స్యకారులు. తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Previous articleశిక్షణ తరగతులను సందర్శించిన సేవ అధ్యక్షురాలు
Next articleమారికంబ దేవికి తుంగభద్ర నీళ్లతో అభిషేకం వర్షం కోసం తుంగభద్ర నదికి వెళ్లి దేవాలయాలు అన్ని నీటితో అభిషేకాలు భారీగా వర్షాలు రైతన్నలు కళ్ళలో ఆనందం కౌతాళం లో పండుగ వాతావరణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here