పాములపాడు
జగనన్న చేదోడు పథకం ఆర్థిక సహాయం ఇంటి దగ్గరే వృత్తి చేసే వారందరికీ షరతులు లేకుండా ఇవ్వాలని మండలంలో రజకుల సమస్యలు పరిష్కరించాలని పాములపాడు ఎంపీడీవో రాణెమ్మ కు మెమోరాండం ఇవ్వడం జరిగిందిఈసందర్భంగా రజక సంఘం మండల నాయకులు మాట్లాడుతూ పాములపాడు మండలం రజక కుటుంబాలు 800 కుటుంబాలు ఉన్నాయి వారు నేటికి కూడా 80 శాతం వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అని ప్రధానంగా పాములపాడు మండల కేంద్రంలో రజక వృత్తి దారులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక వృత్తి చేసుకోవడానికి ఇబ్బందులకు గురవుతూ పట్టణానికి వలస వచ్చి అపార్ట్మెంట్ వాచ్మెన్ రోడ్ల పైన బంకులు వేసుకొని మరియు తోపుడుబండ్ల ద్వారా తిరుగుతూ రజక వృత్తి కొనసాగిస్తున్నారు. రజక వృత్తి లో మార్పు రావడం వలన ఇంటి అద్దెలు షాపు బాడుగ కట్టలేక యజమానులఇంటి దగ్గరనే బట్టలు ఉతికి వృత్తిదారులు వారి ఇళ్లకు బట్టలు తీసుకొని వచ్చి ఇస్త్రీ చేసే పరిస్థితి ఉన్నది కావున షరతులు లేకుండా వృత్తి చేసుకునే వారందరికీ జగనన్న చేదోడు పథకం ఆర్థిక సహాయం షరతులు లేకుండా ఇవ్వాలని కోరుతున్నాము రజక వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షుడు వనర్ల రామకృష్ణ. మండల ఉపా అధ్యక్షుడు జూపల్లి రాజు , ప్రధాన కార్యదర్శి జూపల్లి మద్దిలేటి, కమిటీ సభ్యులు రాయపాటి గోవిందు , సి. ధర్మయ్య,జూపల్లి శ్రీకృష్ణ, భీముడు, మధు,మల్లికార్జున,చింతలపల్లే శ్రీను, లింగేశ్వర్, చిన్న స్వామన్న, ఓబులేసు, లక్ష్మన్న, వెంకటస్వామి, శివుడు,తదితరులు పాల్గొన్నారు