చిత్తూరు సెప్టెంబర్ 18
నగరి చేనేత పరిశ్రమను ప్రగతి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతగా నగరి చేనేత కార్మికులు వారి చిత్రాలను హాఫ్‌సిల్క్ శారీ జరీ బోర్డర్‌పై నేశారు. నేత పరిశ్రమను సాంకేతికత వైపు మళ్లించేందుకు ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఆమె భర్త, రాయలసీమ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కేసెల్వమణి హిందూపూర్ నేత పరిశ్రమ వారితో చర్చించి నగరి మునిసిపాలిటీకి అధునాతన డిజైన్లలో చీరలు నేసే జకార్డ్ యంత్రాలు తెప్పించారు. ఈ ఆధునిక యంత్రాల్లో చీర నేయడాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు.