Home ఆంధ్రప్రదేశ్ పవన్ వ్యాఖ్యలవేనుక జగన్ హస్తం

పవన్ వ్యాఖ్యలవేనుక జగన్ హస్తం

85
0

పెందుర్తి
సీఎం జగన్మోహన్ రెడ్డి పై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు వెనుక సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. కుల రాజకీయాలు మానుకోవాలని అన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆదర్శాల కోసం వచ్చారు తప్ప ఆదాయం కోసం కాదు మాజీ మంత్రి బండారు అభిప్రాయపడ్డారు. సినిమాల్లోనే ఎక్కువగా డబ్బులు వస్తాయి కానీ మంచి ఆదర్శం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. 2014 లోనే కలిసి పోటీ చేశాము. చంద్రబాబునాయుడు కు పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అవసరమైతే 2024 కలిసి పోటీ  చేస్తామని అన్నారు.
ఈ ప్రభుత్వంలో అవినీతి దారుణంగా పెరిగిందని మాజీ మంత్రి బండారు సత్యమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. 2023 కే ప్రభుత్వం కూలిపోతుంది. వైఎస్ఆర్సీపీ మంత్రుల మాట తీరు చూస్తే సిగ్గేస్తుంది. చిన్న చిన్న విషయానికి మీడియా ముందుకొచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, పవన్ కళ్యాణ్ విషయంపై ఎందుకు ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. కులమతాలను రెచ్చగొట్టడానికై మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై తెరమీద తీసుకొచ్చారు.

Previous articleమంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి
Next articleప్రకృతి వనం ను పరిశీలించిన కలెక్టర్ వర్క్ ఫైల్ సక్రమంగా ఉండేలా చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here