జగిత్యాల సెప్టెంబర్ 30
పట్టణ అభివృద్దే, సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, దానికి ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆన్నారు. గురువారం జగిత్యాల పట్టణంలోని 5 వ వార్డు మరియు 43 వార్డులల్లో పట్టణ ప్రగతి నిధులు 13.50లక్షలతో చేపట్టనున్న సిసి.రోడ్డు అభివృద్ధి పనులకు జగిత్యాల శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ డా. భోగ శ్రావణి తోకలసి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్దే, సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని దానికి ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని కావున ప్రతి ఒక్కరు బాధ్యతగా ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, ప్లాస్టిక్ భూతంను అంతం చెయ్యాలని ఆన్నారు.ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని, మున్సిపల్ ద్వారా నాటిన మొక్కలు నీరు పోసి సంరక్షించాలని ప్రజలను కోరారు. అలాగే నూతనంగా ఇండ్లు నిర్మాణం చేసుకునే వారు తప్పనిసరిగా మున్సిపల్ అనుమతి తీసుకొని మరియు సెట్ బ్యాక్ వదలి ఇంటిని నిర్మించుకోవాలని పిలుపు నిచ్చారు.ఆనంతరం
చైర్ పర్సన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే డా. సంజయన్న సహాకరంతో పట్టణ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అలాగే పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని పట్టణ అభివృద్ధి తోడ్పలని పిలుపు నిచ్చారు..ఈ కార్యక్రమంలో కమీషనర్ స్వరూప రాణి, స్థానిక కౌన్సిలర్లు గుగ్గిళ్ల హరీష్, పిర్డోస్ తరున్నం, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, కౌన్సిలర్లు, కో.ఆప్షన్ మెంబర్లు, డి.ఈ రాజేశ్వర్ రావు, ఏ.ఈలు ఆయుబ్ ఖాన్, శరణ్ తేజ్, తెరాస నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
Home తెలంగాణ జగిత్యాల పట్టణ అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యం ప్రజల భాగస్వామ్యం తోనే పట్టణాభివృద్ధి.. ఎమ్మెల్యే డా.సంజయ్...