Home తెలంగాణ జల్ జంగల్ జమీన్..కొమరం భీమ్. టీబీసీ...

జల్ జంగల్ జమీన్..కొమరం భీమ్. టీబీసీ జేఏసి ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు

246
0

జగిత్యాల అక్టోబర్ 22
చరిత్రలో జల్ జంగల్ జమీన్ నినాదంతో అప్పటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిపి అమరుడు కొమరం భీమ్ అని టీబీసీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు.శుక్రవారం జిల్లా టీబీసీ జేఏసి ఆధ్వర్యంలో పటెండ్లవాడలోని హరి నర్సయ్యపటేల్,పుప్పాల నారాయణ పటెండ్ల స్మారక భవన్లో కొమరం భీమ్ జయంతి వేడుకలను నిర్వహించారు.కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ కొమరం భీమ్ జయంతి,వర్దంతులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడం హర్షణీయమన్నారు.భీమ్ ఆశయాల మేరకు తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చాల న్న డిమాండ్ ను  ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించారన్నారు. .పాలనలో సైతం గిరిజనులను భాగస్వాములుగా చేసిన ఘనత సీ ఎం.కేసీఆర్ కే దక్కుతుందన్నారు.కొమరం భీమ్ కొట్లాడిన పొరుగడ్డ జోడేఘాట్ లో 25 కోట్లతో కొమొరం భీమ్ స్మారక చిహ్నం, స్మృతి వనం,గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి ఆయన పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియజేసి గొప్ప ఉద్యమ కేంద్రంగా ప్రభుత్వం తయారు చేసిందని గుర్తు చేశారు  .ఆదివాసీల ఆత్మ గౌరవం నిలిపేలా 25 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో కొమరం భీమ్ ఆదివాసీ భవన్ నిర్మాణం చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల జిల్లా నేత విఠల్ రావ్, ఉపాధ్యాయ  జిల్లా నేత నునావత్ రాజు,టీ బీసీ జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి విజయ్,ఉపాధ్యక్షుడు సింగం భాస్కర్, మహిళా జేఏసి జిల్లా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి, సింగం పద్మ,మిట్టపల్లి కృష్ణ మూర్తి,రుద్ర రవి,మనోహర్ పటేల్,  లక్ష్మన్ ,ములస్తం శివ ప్రసాద్,వొడ్నాల జగన్,కార్తిక్,అనిల్,రామ్ కుమార్,బీసీ, గిరిజన,ప్రతినిధులు పాల్గొన్నారు.

Previous articleధర్మపోరు దీక్షకు కదిలిన గోనెగండ్ల టిడిపి నాయకులు
Next articleమిలాదున్నబీ పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మీలాద్ కమిటీ బాధ్యులు మౌలాన అలీమోద్దీన్ నిజామీ.. గులాం రబ్బానీ.. ఫరీద్ బాబా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here