పత్తికొండ
పత్తికొండ పట్టణంలో గురువారం ఉదయం పోలీస్ స్టేషన్ సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో టిడిపి నేతల బూతు పురాణం వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జనాగ్రహం దీక్షా శిబిరం వద్ద పాల్గొన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రోజురోజుకు పెరుగుతున్న జన ఆదరణ చూడలేక టిడిపి బూతు పురాణాలతో గొడవలకు ప్రేరేపిస్తుందన్నారు. చంద్రబాబునాయుడు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని, టిడిపి బంద్ ప్రకటించగా అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు చంద్రబాబు నిర్ణయం అప్రజాస్వామికమని తక్షణమే క్షమాపణ చెప్పాలని దీక్ష శిబిరంలో పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ దీక్షకు మద్దతు తెలిపారు. దీక్షలో కూర్చున్న పత్తికొండ మండలం సర్పంచులు, ఎంపీటీసీలు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీ లు, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర జడ్పీటీసీలు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.