బద్వేలు
బద్వేల్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల మద్దతు బి జె పి కే అని ఆ పార్టీ నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీలకు ఉమ్మడి శత్రువు అని మాజీ మంత్రి అన్నారు బద్వేలులో మాజీ మంత్రి విలేకరులతో మాట్లాడుతూ మాట్లాడుతారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం పాపర్ అయిందని ఆరోపించారు రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి దివాలా చేశారని ఆరోపించారు రాష్ట్రంలో వైకాపా నాయకులు కార్యకర్తలు రౌడీలు గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బద్వేల్ ఉప ఎన్నికల్లో వైకాపా రౌడీయిజం చెల్లదని అన్నారు వారి అరాచకాలు దౌర్జన్యాలు సమర్థవంతంగా ఎదుర్కొని తగిన గుణపాఠం చెబుతామని మాజీ మంత్రి అన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని గతంలో రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని ఆయన పాలన చూసి రాష్ట్ర ప్రజలే ఛీ కొడుతున్నారని ఆయన అన్నారు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పు చేస్తున్నారని ఆ హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు పనులు చేసిన కాంట్రాక్టర్ల బాధలు అంతా ఇంతా కాదు అన్నారు బద్వేలులో సమర్థవంతమైన నాయకుని బిజెపి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందన్నారు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి అనే మాటే లేకుండా పోయిందన్నారు బద్వేల్ నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఉప ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద అబద్దాలకోరు అనే విషయం అందరికీ తెలిసింది అన్నారు ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి ఎలా గెలిచింది అందరికీ తెలిసిన బహిరంగ సత్యం అన్నారు ఇంకా పలు విషయాల గురించి మన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు బద్వేలు ఉప ఎన్నికల్లో బిజెపి దీటుగా పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు