Home తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వెంటనే కల్పించాలి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ .టి. జీవన్ రెడ్డి

నిరుద్యోగులకు ఉద్యోగాలు వెంటనే కల్పించాలి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ .టి. జీవన్ రెడ్డి

126
0

జగిత్యాల అక్టోబర్ 16
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అయినప్పటికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వటం లేదని కరీంనగర్ పట్టభద్రుల  ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాల మండలంలోని పోరండ్ల గ్రామా సర్పంచ్ సంధ్య రాణి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాల కొరకు ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంకు బిశ్వాల్ కమిటీ నివేదిక ద్వారా ఒక లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పెడిచేవిన  పెట్టి నిరుద్యోగులకు నిరాశ నిస్పృహలకు, హాత్మహత్యాలకు లోనైయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. విజయదశమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో పోరండ్ల గ్రామానికి చెందిన యువకులు చేరడం రాబోయే రోజుల్లో అమ్మవారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ విజయానికి నాందిగా భావిస్తున్నానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండ మధు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, కౌన్సిలర్ జీవన్, మాజీ కౌన్సిలర్ రమేష్ రావు, బీరం రాజేష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Previous articleబద్వేల్ ఉప ఎన్నికల్లో వైకాపా ఆగడాలు అడ్డుకుంటాం బిజెపి ఎంపీ సురేష్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి
Next articleజగిత్యాలలో రౌడీ షీటర్ దారుణ హత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here