Home తెలంగాణ వెలువడ్డ ఫలితాలు దొరకని ఉద్యోగాలు ఏడాదిన్నర కాలంగా ఎదురుచూపులు

వెలువడ్డ ఫలితాలు దొరకని ఉద్యోగాలు ఏడాదిన్నర కాలంగా ఎదురుచూపులు

140
0

జగిత్యాల సెప్టెంబర్ 22
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగాలైన డాటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ సిస్టం అనలైస్ట్ అసిస్టెంట్ ప్రోగ్రామర్ నియామక ప్రక్రియ చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కి స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు వినతిపత్రం సమర్పించారు సమగ్ర శిక్ష అభియాన్ లో పైన తెలిపిన ఐదు విభాగాలకు సంబంధించి 704 పోస్టులను భర్తీ చేయుటకు ప్రోస్ ఆర్ సి నెంబర్ 2019/ss /T4/2019  ద్వారా 6 11 2019  రోజున నోటిఫికేషన్ ఇచ్చి 23 12 2019 రోజున రాత పరీక్షలు నిర్వహించి 7 1 2020 రోజున ఫలితాలను మరియు మెరిట్ కార్డులను జిల్లాల వారీగా విడుదల చేయడం జరిగింది ర్యాంకులు ప్రకటించి నేటికి ఏడాదిన్నర కాలం విడిపోయినప్పటికీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి నియామక పత్రాలు అందజేయలేదు ఈ నియామక పరీక్షల్లో దాదాపు పదివేల మందికి పైగా అర్హత సాధించి నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు ఈ యొక్క నియామకాల గూర్చి సమగ్ర శిక్ష అభియాన్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభ్యర్థులందరూ కూడా తీవ్ర నిరాశ భయాందోళనకు గురవుతున్నారు సంబంధిత విద్యా శాఖ అధికారులను చాలాసార్లు కలిసి నియామక ప్రక్రియ చేయాలని కోరగా కోవిడ్ 19 వలన చేయలేకపోతున్నామని తెలుపుతున్నారు ప్రస్తుతం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి కావున మా యొక్క సమస్యలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విద్యా శాఖ స్పెషల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా మరియు విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన దృష్టికి తీసుకెళ్లి మా యొక్క నియామక ప్రక్రియ సమస్యని పెద్ద మనసుతో పరిష్కారం చేసి మేము ఉద్యోగాలు పొందే లాగా చూడాలని కోరుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించిన స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు

Previous articleనిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి
Next articleఢిల్లీలోని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై హిందూ సేన కార్యకర్తలు దాడి చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here