అమరావతి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జస్టిస్ మిశ్రాతో బుధ వారం ప్రమాణ స్వీకారం చేయించారు. అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, సాధారణ పరిపాలన శాఖ రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్య రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బాధ్యతలు జస్టిస్ మిశ్రాతో...