పెద్దపల్లి సెప్టెంబర్ 09
కాళోజీ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితల ద్వారా తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడుగా అభివర్ణించారు. వారి రచనల స్ఫూర్తి తెలంగాణ సాధించడానికి మరింత దోహదం చేసిందని తెలిపారు. భారత దేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సన్మానింప బడిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని కోరారు. కాళోజీ రచనలతోనే యువతను తెలంగాణ ఉద్యమం వైపు నడిపించాయని తన రచనల ద్వారా పెత్తందారీ వ్యవస్థ అన్యాయాలను ఎదిరించాడని. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాళోజీ రచనలు యువతలో స్ఫూర్తిని రగిలించినాయని, సామాజిక సమస్యలపై పోరాడిన మహనీయుడు కాళోజి అని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమములో కాళోజీకి నివాళులు అర్పించినవారిలో డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, అడిషనల్ డి.సి.పి ఏఆర్ సంజీవ్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నారాయణ, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, సీఐ సీసీఆర్బీ కమలాకర్, ఆర్ఐ లు మధుకర్, శ్రీధర్, విష్ణు ప్రసాద్, పోలీస్ సంఘం అద్యక్షులు బోర్లకుంట పోచలింగం మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.