Home వార్తలు కళ్యాణ్ దేవ్, పులి వాసు, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ‘సూపర్ మచ్చి’ టీజర్ విడుదల

కళ్యాణ్ దేవ్, పులి వాసు, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ‘సూపర్ మచ్చి’ టీజర్ విడుదల

119
0

‘విజేత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తన రెండో సినిమా సూపర్ మచ్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ సరసన  ర‌చితా రామ్‌ హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. దీపావళి కానుకగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది. ఈ మూవీలో నటించిన లీడ్ యాక్టర్స్ అందరినీ చూపిస్తూ ఈ వీడియో కట్ చేశారు. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ యాక్షన్ సీన్స్ అబ్బురపరుస్తాయని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. అలాగే హీరోహీరోయిన్ల మధ్య షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్‌తో ఎమోషనల్ సన్నివేశాలు చూపిస్తూ ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఈ టీజర్ రిలీజ్ చేయడం విశేషం. ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న ఈ టీజర్‌లో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయింది. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా శరవేగంగా జరుగుతున్నాయి.
నటీనటులు : కళ్యాణ్ దేవ్, రచిత రామ్, రాజేంద్ర ప్రసాద్, నరేష్‌, పోసాని కృష్ణమురళి, ప్రగతి, అజ‌య్‌, మహేష్, షరీఫ్, సత్య

Previous article175 రోజులుగా అన్నదాన కార్యక్రమం నిర్వహాణ
Next articleగిరిజన చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి బహుజన సమాజ్ పార్టీ నాయకులు బీఎస్పీ ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ, ఆర్డివో కు వినతి పత్రం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here