Home జాతీయ వార్తలు కరోనా బారిన కమల్‌హాసన్‌

కరోనా బారిన కమల్‌హాసన్‌

96
0

చెన్నయ్ నవంబర్ 22
ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ కరోనా బారిన పడ్డారు. ఇటీవల అమెరికా వెళ్లొచ్చిన ఆయనకు కాస్త దగ్గుగా ఉండడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఇన్‌ఫెక్షన్‌ కాస్త ఎక్కువగా ఉండడంతో కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్థారించారని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఒంటరిగా ఆసుపత్రిలో ఐసోలేట్‌ అయ్యారు. కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. కమల్‌ ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. మరి ఈ వారం ఎపిసోడ్‌కు ఎవరు వ్యాఖ్యాతాగా వ్యవహరిస్తారనే చర్చ మొదలైంది.

Previous articleఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
Next articleప్రజావాణి కార్యక్రమానికి 69 ఫిర్యాదులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here