Home వార్తలు తుది దశ షూటింగ్ లో కమల్ హాసన్ ‘విక్రమ్’

తుది దశ షూటింగ్ లో కమల్ హాసన్ ‘విక్రమ్’

109
0

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 232వ సినిమా విక్రమ్ సినిమా డిసెంబర్ 10 నుంచి ఫుల్ స్వింగ్‌లో ఉంది. నేడు కమల్ హాసన్ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్స్ అయిన ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, నరైన్, కాళిదాస్ జయరాం వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్ట్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఎన్నో షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కమల్ హాసన్‌కు కరోనా సోకడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. అలా కాస్త బ్రేక్ ఇచ్చిన కమల్ హాసన్ నేడు షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టేశారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ తరుణంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి ప్రముఖ తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత కెమెరామెన్ గిరీష్ గంగాధరణ్, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ డైరెక్టర్ సతీష్, కొరియోగ్రఫర్ శాండీ, యాక్షన్ డైరెక్టర్ అంబరివ్‌. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్, కమల్ హాసన్ సంయుక్తంగా విక్రమ్ సినిమాను నిర్మిస్తున్నారు.

Previous articleవిశాల్, తు ప శరవణన్, వీఎఫ్ఎఫ్ ‘సామాన్యుడు’ నుంచి థీమ్ మ్యూజిక్ విడుదల
Next articleరోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here