Home తెలంగాణ ఘనంగా ప్రారంభమైన కనక దుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు నవరాత్రి...

ఘనంగా ప్రారంభమైన కనక దుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు

238
0

జగిత్యాల అక్టోబర్ 07
దసరా పండుగ సందర్భంగా జగిత్యాల  పట్టణంలో గురువారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.  అమ్మవారి ఉత్సవ ప్రారంభ శోభా యాత్ర బైపాస్ రోడ్డు నుండి జంబిగద్దే, టవర్ సర్కిల్ వైశ్య భవన్ ,న్యూ బస్టాండ్ కృష్ణా నగర్ మీదుగా అష్ట లక్ష్మి ఆలయ అవరణలో అమ్మవారి మండపానికి వేలాది భక్తులతో తాలమెళాలతో, డప్పు, నృత్యాలతో అంగరంగ వైభవంగా కనక దుర్గ కమిటీ ఆధ్వర్యంలో దుర్గాదేవి దీక్షను భక్తులు ప్రారంభించారు. తొమ్మిది రోజులు పాటు విశేష పూజలు, కలశ స్థాపన,వేద బ్రాహ్మణుల  ఆధ్వర్యంలో పలు పూజ కార్యక్రమాలు కోవిడ్ నిబంధనల జాగ్రత్తలను పాటిస్తూ  తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను , శ్రీ మాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక, రాధా కృష్ణ  అయ్యావారి  ఆధ్వర్యంలో పంచ బ్రాహ్మణ వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ప్రతి రోజూ  మధ్యాన్నం అల్పాహారం , రాత్రి భిక్ష పెట్టనున్నట్లు కనక దుర్గా సేవ సమితి సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం,చేటిపెల్లి సుధాకర్, చిట్ల సుధీర్,అనిల్ కుమార్,శివ ప్రసాద్, రాము, మహేందర్,నిరంజన్, సాయి,సాయి చరణ్, సంజయ్,చిట్ల రమేష్, రాజ శేఖర్,దీపక్, తదితరులు పాల్గొన్నారు.

Previous articleబద్వేలు ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్ధి నామినేషన్ దాఖలు
Next articleరక్షణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి ఆర్ కె 6 గని మేనేజర్ సంతోష్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here