హైదరాబాద్ డిసెంబర్ 2
వివిధ యూనివర్సిటీలలో ఆర్థిక, సామాజిక అంశాలపై పరిశోధనలు చేసే విద్యార్థులకు ప్రణాళికా శాఖ ప్రచురణలు కర దీపిక లాగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంత్రుల నివాసంలో కాకతీయ యూనివర్సిటీలో పీ.హెచ్.డీ. స్కాలర్స్ డాక్టర్ బొల్లికొండ వీరేందర్, డాక్టర్ మేడారం సుధాకర్ లకు ప్రణాళికా శాఖ ప్రచురణలను వినోద్ కుమార్ బహూకరించారు.ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సూక్ష్మ పరిశీలన, లోతైన విశ్లేషణలతో రూపొందిస్తున్న పథకాలు వంటి అనేక అంశాలు, సమగ్రమైన సమాచారాన్ని గణాంకాలతో ప్రచురణలు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయని పేర్కొన్నారు.కేవలం స్కాలర్స్ కే కాకుండా వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రణాళికా శాఖ ప్రచురణలు దిక్సూచిగా ఉంటాయని వినోద్ కుమార్ వివరించారు.ప్రణాళికా శాఖ ప్రచురణలను ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్స్ సహా వివిధ లైబ్రరీలకు అందజేసినట్లు వినోద్ కుమార్ తెలిపారు.పరిశోధక విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రణాళికా శాఖ ప్రచురణలను క్షుణ్ణంగా చదవాలని వినోద్ కుమార్ సూచించారు.
Home తెలంగాణ పోటీ పరీక్షల అభ్యర్థులకు కర దీపిక ప్రచురణలు పీ.హెచ్.డీ స్కాలర్స్ కు ప్రచురణలను బహూకరించిన బోయినపల్లి...