బెంగళూర్ అక్టోబర్ 12
దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. దేశం ప్రస్తుతం బొగ్గు సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ సెగ కర్ణాటకకు కూడా పాకింది. నేటి నుంచి విద్యుత్ కోతలు ఉండబోతున్నట్టు ప్రభుత్వ రంగ బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బీఈఎస్సీవోఎం) ప్రకటించింది. రాష్ట్రానికి బొగ్గు సరఫరాను నాలుగు రేక్లు పెంచాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్న గంటల్లోనే బీఈఎస్సీవోఎం ప్రకటించడం గమనార్హం. మహారాష్ట్రలోని చంద్రపూర్ ఒడిశాలోని మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ గనుల నుంచి కర్ణాటక బొగ్గు కేటాయింపు పొందినందున అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. బెంగళూరులోని సౌత్ జోన్ పరిధిలో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య మిగతా ప్రాంతాల్లో ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 1.30 మధ్య మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం 10-5.30 మధ్య వెస్ట్ జోన్ పరిధిలో ఉదయం 10.30- 5.30 మధ్య ఈస్ట్ జోన్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నార్త్ జోన్ లో ఉదయం 11-5 మధ్య విద్యుత్ కోతలు ఉంటాయని బీఈఎస్ సీవోఎం ప్రకటించింది.అక్టోబర్ 7 న కేంద్ర విద్యుత్ అథారిటీ నివేదిక ప్రకారం దేశంలోని 135 ప్లాంట్లలో 110 కర్మాగారాలు బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. క్లిష్ట పస్థితిస్థికి చేరుకున్నాయి. అలాగే 16 ప్లాంట్లలో ఒక్క రోజు కూడా బొగ్గు నిల్వ లేదని తెలుస్తోంది. అలాగే 30 ప్లాంట్లలో కేవలం ఒక్క రోజు వరకే బొగ్గు మిగిలి ఉందంటం. అదేవిధంగా 18 ప్లాంట్లలో కేవలం 2 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయంట. అంటే పరిస్థితిస్థి చాలా తీవ్రంగా ఉందని అర్థమవుతోంది. వీటిలో హర్యా నా మహారాష్ట్రలలోనే 3 ప్లాంట్లు ఉన్నాయంట. అక్కడ స్టాక్ ఒక్క రోజు కూడా లేదంట. అదేవిధంగా పంజాబ్ రాజస్థాన్ ఉత్తర ప్రదేశ్ ఛత్తీస్ గఢ్ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు బీహార్లో ఒక్కో ప్లాంట్ ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయంట. వీటిల్లో కేవలం ఒక్క రోజే స్టాక్ మిగిలి ఉంది. అదే సమయంలో పశ్చి మ బెంగాల్లోని 2 ప్లాంట్లలో అలాంటి పరిస్థితిస్థి నెలకొంది. దీంతో కేరళ మహారాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ను చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేయడంతో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో తెలుస్తోంది.గత సంవత్సరం దేశంలో బొగ్గు నుంచి 1125.2 టెరావాట్- గంటల విద్యుత్ ఉత్పత్తి చేయబడింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. కానీ ఈ ఏడాది విషయం భిన్నంగా ఉంది. గత రెండు నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా కోలుకుంది. గత 18 నెలల కోవిడ్ ఆంక్షల కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో విద్యుత్ వినియోగం నెలకు 124.2 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2019లో ఈ రెండు నెలల్లో నెలకు 106.6 బిలియన్ల యూనిట్లుగా నమోదైంది. ఈ కాలంలో బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి 2019 లో 61.91 శాతం కాగా ఈ సంవత్సరం 66.35 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో 2019 తో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ లో బొగ్గు వినియోగం 18 శాతం పెరిగింది.