వేములవాడ
ఇన్నాళ్లు దళిత బందు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన సిఎం కేసిఆర్ ఇప్పుడు దళిత బందు నిలిపి వేశారని భాజపాపై నెట్టుతున్నారని దీనికి నిరసనగా భారతీయజనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ ఆధ్వర్యంలో వేములవాడ లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.ఈ సందర్బంగా సం టి మహేష్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ దళిత బందును కేవలం ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మీకు తెలియదా .అందుకు కారణం బిజెపి అని టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనటం విడ్డూరంగా ఉందని.దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ఎన్నికల కోడ్ వుంటుందని ఆ కోడ్ వున్నప్పుడు ఎలాంటి ఆర్థిక పరమైన మంజూరు చేయరాదని టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు తెలుసుకోవాలని ఎస్సీ మోర్చా అన్నారు.ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల పైన చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎందుకు ఇవ్వలేదు చెప్పాలన్నారు కొద్దిమంది అకౌంట్లో డబ్బులు వేసి ఆ అకౌంట్లను ఎందుకు స్తంభింప చేశారని కెసిఆర్ చెప్పాలన్నారు. కెసిఆర్ ప్రభుత్వం హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బందు అనేపథకాన్నితీసుకువచ్చామని స్వయంగా కేసీఆర్ ఏ చెప్పాడుకాబట్టి హుజురాబాద్ లో దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నందున దళితులకు ఆశచూపి హుజురాబాద్ ఎన్నికల్లో గెలవాలనే ఆశతో ఈ పథకాన్ని తీసుకు వచ్చారని రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు .అంతేగాని దళితులకు 10 లక్షలు ఇవ్వాలని లేదు అని అందుకే హడావుడిగా ఈ డ్రామాలు ఆడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గోపు బాలరాజు బిజెపి పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోలా కృష్ణ స్వామి నాయకులు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి శ్రీనివాస్ గౌడ్ గడ్డమీది శ్రీనివాస్ తిరుమల్ రెడ్డి సుమంత్ రెడ్డి అన్నారం శ్రీనివాస్ జింక అనిల్ బిల్లా కృష్ణ గుడిసె మనోజ్ సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు