నాంపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం వట్టిమళ్ళ గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల గిరిజన బాలికపై టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకుడు అత్యాచారం చేసి హత్య చేసే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమైన సంఘటన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. రెడ్‌హిల్స్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంగళవారం పరామర్శించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. చివరి ఘడియలో బాలిక ప్రాణాలు కాపాడే ప్రయత్నం జరిగిందని అన్నారు. స్థానిక ప్రజానీకం ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదన్నారు.