హైదరాబాద్ అక్టోబర్ 19
సమయం, సందర్బాన్ని బట్టి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేసీఆర్‌కు ఉప రాష్ట్రపతి పదవి అనేది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం అని పేర్కొన్నారు. తాను వేరే వారిలాగా చిలుక జోస్యం చెప్పలేను అని అన్నారు. తాను హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లడం లేదు. నాగార్జున సాగర్, దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెళ్లలేదు. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రచారం షెడ్యూల్ ఖరారు కాలేదన్నారు.నాగార్జున సాగర్‌లో జానా రెడ్డినే ఓడించాం. ఈటల రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా? అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఈటల బీజేపీ బురదను అంటించుకున్నారు. బీజేపీని ఈటల, బీజేపీ ఈటల సొంతం చేసుకోవడం లేదు. జై ఈటల అంటున్నారు తప్ప జై శ్రీరామ్ అని ఎందుకు అనడం లేదు అని ప్రశ్నించారు. రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో ఇంత వరకు చెప్పడం లేదు. గెలిస్తే ఏం చేస్తాడో చెప్పకుండా.. వేరే విషయాలు మాట్లాడుతున్నారు. హుజూరాబాద్‌లో ఈటల, రేవంత్ కుమ్మక్కయ్యారు.
రేవంత్ చిలక జోస్యం చెప్పుకుంటే బెటర్
రేవంత్ రెడ్డి చిలక జోస్యం చెప్పుకుంటే బెటర్ అని కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్‌లో కావాలనే కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపలేదు. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక.. ఇది తొలి ఉప ఎన్నిక. తనను తాను నిరూపించుకోవాలి కదా..? ఎందుకు హుజూరాబాద్‌కు వెళ్లడం లేదని రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న సన్నాసి ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకోలేదన్నారు.నవంబర్ 15 తర్వాత తమిళనాడుకు వెళ్తామని కేటీఆర్ తెలిపారు. డీఎంకే, అన్నాడీఎంకే నిర్మాణాన్ని అధ్యయనం చేస్తామన్నారు. నీట్ రద్దుపై స్టాలిన్‌తో 100 శాతం ఏకీభవించలేం. తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. రాష్ట్ర విద్యార్థులకు ఏది మేలైతే.. ఆ నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.