Home వార్తలు కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ ఫస్ట్ సింగల్ విడుదల

కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ ఫస్ట్ సింగల్ విడుదల

259
0

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విభిన్న కథలను ఎంచుకుంటున్నారు. రాజా వారు రాణి గారు రస్టిక్ అండ్ రొమాంటిక్ డ్రామా కాగా.. ఎస్ఆర్ కళ్యాణమండపం రొమాంటిక్ యాక్షన్ డ్రామా.ఆ రెండూ కూడా కమర్షియల్‌గా విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మ్యూజికల్ రొమాంటిక్ ‘ఎంటర్టైనర్ సమ్మతమే’ అంటూ అర్బన్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతోన్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. కృష్ణ అండ్ సత్యభామ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు. కృష్ణ సత్యభామల మధ్య ఉండే ప్రేమను చూపించేలా.. కిరణ్ చాందినీల మధ్య రొమాంటిక్ ట్రాక్‌ను ఈ పాటలో అద్భుతంగా చూపించేశారు. శేఖర్ చంద్ర అందించిన మెలోడి ట్యూన్ ఆకట్టుకుంటోంది. కృష్ణ కాంత్ సాహిత్యం యూత్‌ను మెప్పించేలా ఉంది. యాజిన్ నాజిర్, శిరీష భగవతుల గాత్రం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి సరికొత్త ప్రేమకథతో రాబోతోన్నట్టు కనిపిస్తోంది.  ఫస్ట్ గ్లింప్స్‌,  పాటతో సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. హీరో హీరోయిన్ల కారెక్టర్‌లో ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. హీరో కిరణ్ అబ్బవరం సైలెంట్, కూల్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తే.. హీరోయిన్  చాందినీ చౌదరి మాత్రం మందు, దమ్ము కొడుతూ చిల్ అవుతోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న సమ్మతమే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.
నటీనటులు : కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి తదితరులు

Previous articleనందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ టీజర్ విడుదల
Next articleడిసెంబర్ 6న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప: ది రైజ్’ ట్రైలర్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here