విశాఖపట్నం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)పాడేరు శాఖ ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పాతుని రవికిరణ్ పాత్రుడు మాట్లాడుతూ భారతదేశంలో గిరిజనుల హక్కుల కోసం జరిగిన పోరాటంలో గిరిజనులపై నిజం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలకు ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి జల్ జంగిల్ జమిన్ నినాదానికి కొమరం భీమ్ ప్రతీకగా నిలిచారని, కొండ కొనలో ప్రకృతిలో సహా జీవనం సాగించే గిరిజన ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ 1927 నుంచి 1940 వరకు రణభేరి మోగించిన కొమరం భీమ్ నిజం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మరీనా పోరాట యోధుడని, అలాగే నిజం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొమరం భీమ్ కొనసాగించారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు అంగనైని ఆనంద్,నగర కార్యవర్గ సభ్యులు చిన్ని రాజు,సుజాత, ప్రగతి పాల్గొన్నారు.