జగిత్యాల సెప్టెంబర్ 21
దేశంలో బాపూజీ అని గౌరవం దక్కిన రెండో వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని టీ బీసీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 9వ వర్ధంతి సందర్భంగా అంగడి బజార్ లో గల బాపూజీ విగ్రహానికి టీబీసీ జేఏసి జిల్లా శాఖ ఆధ్వర్యంలో హరి అశోక్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని,బీసీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు.స్వాతంత్ర్య సమరయోధుడైన బాపూజీ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తుచేశారు.బంగారు తెలంగాణ సాధించడమే బాపూజికి అసలైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,మార్కెట్ డైరెక్టర్ బండారి విజయ్,ఉపాధ్యక్షుడు సింగం భాస్కర్, యువజన ఉపాధ్యక్షుడు మిట్టపల్లి కృష్ణమూర్తి,జిల్లా అధ్యక్షుడు కొండా లక్ష్మణ్, కార్యదర్శి ములస్తం శివ ప్రసాద్, జిల్లా యువజన జేఏసి అధ్యక్షుడు,మున్సిపల్ కౌన్సిలర్ కూసరి అనిల్ కుమార్,కార్యదర్శి ,మున్సిపల్ కౌన్సిలర్ పంబాల రామ్ కుమార్,మహిళా జిల్లా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి,నాయకులు సింగం గంగాధర్,అలిశెట్టి ఈశ్వరయ్య, పుప్పాల కిషోర్ కుమార్,లైసెట్టి వెంకట్, ధోనూరి భూమాచారి,టీబీసీ సంక్షేమ, యువజన, మహిళ, విద్యార్థి, ఉద్యోగుల, కార్మికుల జేఏసి ప్రతినిధులు పాల్గొన్నారు.
=========================
47 మహిళా సర్పంచ్ పట్ల ఎమ్మెల్యే తీరుపై నిరసన
అనకాపల్లి
మండలంలోని మాకవరం గ్రామానికి చెందిన దళిత మహిళా సర్పంచ్ మొయ్య భవానిని అవమానపరిచిన స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమర్‌నాథ్ తక్షణమే ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ స్థానిక రామచంద్ర థియేటర్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బోని గణేష్ మాట్లాడారు.