గోరంట్ల శకుంతలకు పిల్లల దుస్తులు అందజేత
అకాల వర్షం, వరదల ప్రభావంవల్ల కడపజిల్లాలో కొన్నిప్రాంతాలు దెబ్బతినగా నేనున్నానంటూ వరద బాధితులను ఆదుకునేందుకు రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపకురాలు గోరంట్ల శకుంతల శ్రీకారం ముందుకొచ్చారు. వరద బాధితుల
సహాయార్థం వాడవాడలా తిరుగుతూ విరాళాలు, వస్తురూపేణా సేకరిస్తున్నారు. అందులో భాగంగా చందనబ్రదర్స్ షాపింగ్ మాల్ యాజమాన్యంవారు పిల్లల దుస్తులు అందజేశారు. కొందరు దాతలు బియ్యం, బిస్కట్లు అందజేశారని శకుంతల
తెలిపారు. దాతలు ఇచ్చిన విరాళాల్ని, వస్తువుల్ని కడప జిల్లాలోని వరద బాధితులకు రేపు అందజేస్తామని గోరంట్ల శకుంతల పేర్కొన్నారు.