కువైత్ అక్టోబర్ 12
వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న కువైత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వేలాది మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌లను క్యాన్సిల్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రొఫెషన్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన సుమారు 40వేల మంది వలసదారులు ప్రొఫెషన్ మారిన తర్వాత తిరిగి వాటిని ప్రభుత్వానికి అప్పగించలేదు. ఇలా ప్రొఫెషన్ మారిన తర్వాత కూడా డ్రైవింగ్ లైసెన్సులను ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో వారు ఆటోమెటిక్ ఆ లైసెన్స్‌లను కోల్పోయినట్లేనని అధికారులు పేర్కొన్నారు. కొత్త ప్రొఫెషన్ ఆధారంగా పాత లైసెన్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ, చాలామంది అలా చేయలేదు. అంతేగాక వీటిలో చాలా మంది లైసెన్సులకు గడువు ముగిసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇలా గడువు ముగిసిన వాటితో పాటు ప్రొఫెషన్ మారిన వారి లైసెన్సులను రద్దు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.