జగిత్యాల నవంబర్ 23
ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు భాను ప్రసాద్ రావు, ఎల్. రమణలు మంగళవారం కరీంనగర్ లో నామినేషన్ దాఖలు చేయగా జిల్లాకు చెందిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు.సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేశ్ , జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ పాల్గొన్నారు. ఇంకా వారితో పాటు బాను ప్రసాద్, ఎల్ రమణ ల సన్నిహితులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంకు హాజరయ్యారు.