రాజమండ్రి
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటన రాజమహేంద్రవరం జాతీయ రహదారి పై ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో రాత్రి 1.గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులను వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు త్రీవ్ర గాయాలతో ఘటనా స్థలం లోనే దుర్మరణం పాలయ్యాడు. మరో యువకుడు పరిస్తితి విషమం గా వుంది. అతడిని 108 లో ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. బొమ్మూరు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమ బద్దీకరించారు.