Home తెలంగాణ అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య

అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య

133
0

కోరుట్ల నవంబర్ 11
కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ ను
గురువారం కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య -అనిల్, వైస్ చైర్మెన్ గడ్డమీది పవన్ లు ప్రారంభించారు .ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో మొదటిసారిగా అన్ని రకాల రక్త మూత్ర పరీక్షలు అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. నాణ్యతతో కూడిన రిపోర్టులు అందించాలని సూచించారు.
ఈ అవకాశాన్ని  పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చైర్ పర్సన్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్ దంపతులతో పాటు వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత- గంగాధర్ ,అపోలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్  రవీంద్ర, నిర్వాహకులు చంద్రశేఖర్,తెరాస యూత్ ప్రధాన కార్యదర్శి పుప్పల నాగరాజు, మైనారిటీ యూత్ నాయకులు ఎండి ఆమెర్ తదితరులు పాల్గొన్నారు.

Previous articleఈ నెల 18 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
Next articleతీరాన్ని తాకిన వాయుగుండం: తమిళనాడులో 14 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here