బెల్లంపల్లి అక్టోబరు 11 ,
బెల్లంపల్లి పట్టణం కాంగ్రెస్ కార్యాలయం ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం దశాబ్దాల క్రితం నిర్మించింది, ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మా గాంధీ విగ్రహం చేతి ని, చేతి కర్రను వీరగ గొట్టడం గమనించిన నాయకులు 1టౌన్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసిన పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్, నాయకులు. అనంతరం పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ మహాత్మా గాంధీ విగ్రహంపై దాడి చేసి గాంధీ విగ్రహం చేతిని కర్రను విరగగొట్టి అవమానించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు, జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అలాంటి జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ను కక్ష తీర్చుకొనేందుకు అలా చేయడం అవమానించడం చాలా బాధాకరం అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. దాడికి సంబంధించిన వారు ఎవరైనా వారిని విడిచిపెట్టేది లేదు అని అన్నారు…