Home తెలంగాణ లీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి – పోలిసుల త్యాగం అజరామరం – పెద్దపల్లి...

లీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి – పోలిసుల త్యాగం అజరామరం – పెద్దపల్లి డిసిపి పి.రవీందర్ – పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు పరామర్శ

85
0

పెద్దపల్లి   అక్టోబర్ 21

రామగుండం కమిషనరేట్ రామగుండం కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం   సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దపల్లి డిసిపి పి.రవీందర్, డిసిపి అడ్మిన్ ఎన్.అశోక్ కుమార్ పోలిస్ గౌరవందనం తీసుకుని అమరవీరుల స్థూపము వద్ద కాగడాను వెలిగించి, అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛము ఉంచి  నివాళులు అర్పించారు. అడ్మిన్ డిసిపి మాట్లాడుతూ అక్టోబర్ 21 -1959 సంవత్సరంలో 20 మంది జవాన్లు కలసి లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద  విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన  వారిపై దాడి చేసి 10 మందిని హతమార్చినదనీ, అప్పటి నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణ లో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్-21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుండి ప్రారంభమైనదన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం అమరులైన పోలీసుల జీవితాలనే మనం మార్గదర్శకంగా, ఆదర్శంగా మలుచుకుంటు ప్రజాసేవకు, ప్రజల ధన, మాన‌, ప్రాణాల రక్షణకు పునరంకితం కావడమని, ఉగ్రవాదం, తీవ్రవాదం‌, మతతత్వం వంటి విఛ్ఛిన్న కర శక్తులతో నేరాలకు, ఘోరాలకు‌ పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడవలసి రావడంతో పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాగ ఎంతో ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. సమయంతో పనిలేదనీ, ప్రాంతంతో పనిలేదనీ, ప్రమాదం, ఏదైనా సంఘటనలు జరిగాయని తెలిస్తే.. అక్కడ ముందుగా ఉండేది పోలీస్, రక్షణ అంటే గుర్తొచ్చేది పోలీస్, పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నదన్నారు. ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు మాత్రమే పరిమితమయింది కాదని, ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే, పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమన్నారు. ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే, అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో పోలీసులే ముందుంటారని, ధనవంతులు మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరానికీ సాయం కోరేది పోలీసులనే,  శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది, శాంతిభద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్ళను నియంత్రించడం పోలీసు కర్తవ్యమన్నారు. అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారని, త్యాగాలకు భయపడకుండా వెనుకడుగు వేయకుండా రెట్టించిన సమరోత్సాహంతో అసాంఘిక శక్తులతో పోరాడి విజయాన్ని సాధించడం జరిగిందన్నారు. పోలీసులు త్యాగం చేయని రోజు అంటు ఉండదు సెలవులు, పండుగ దినాలు, అధిక గంటలు పని చేయవలసి రావడం, ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేసి, అవిశ్రాంతంగా పని చేయడం వంటివి కూడా త్యాగలే, పోలీసుల తప్పులు ప్రచారం అవుతున్నంతగా వారి త్యాగాలు ఆశించిన స్థాయిలో గుర్తింపుకు నోచుకోవడం లేదని, ఈ సంవత్సరంలో మన దేశంలో విధి నిర్వహణలో (377) మంది వీరమరణం పోందిన వారందరికీ మనము అందరము శ్రద్దాంజలి ఘటిస్తున్నామని తెలిపారు. వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని, వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను సర్వస్వం లభింపచేయడం, అయా కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమర వీరులకు మనం అందించే నిజమైన నివాళి అన్నారు. పోలీసులు చేస్తున్న అత్తున్యత త్యాగాలను సమాజం గుర్తుంచుకొనే విధంగా  కమీషనరేట్ నందు ఈరోజు నుండి oct 31 వరకు పోలీసు స్టేషన్ లలో ఓపెన్ హౌజ్ కా‌ర్యక్రమాలు, కొవ్వొత్తి ర్యాలీలు, నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని  త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తాం అని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్, ఏఆర్ అడిషనల్ డిసిపి సంజీవ్, ఎసిపిలు గిరి ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి నారాయణ, ఏసీపీ ఏఆర్ సుందర్ రావు, సిసిఅర్బి ఇన్స్పెక్టర్ కమలాకర్ ,ఇన్స్పెక్టర్స్, సబ్ఇన్స్పెక్ ర్స్ రిజర్వడ్ ఇన్స్పెక్టర్స్, రామగుండము పోలీస్ కమిషనరేట్ పోలీస్ సంఘం అద్యక్షులు బోర్లకుంట పోచలింగం, ఎఒ నాగమణి, ఎఆర్, సివిల్ పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Previous article“సిరిసిల్ల బ్రదర్స్” కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శ పాత్రికేయులను పరామర్శించిన వాస్తుపండితులు వేణుగోపాలా చార్యా
Next articleబొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి – సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here