కోరుట్ల అక్టోబర్ 27
పట్టణంలో
75 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడిన, వాటిని నిల్వ చేసిన చట్ట పరంగా చర్యలు
తీసుకొంటామని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆన్నారు..
మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యాపారస్థులు 75 మైక్రాన్ల కంటే తక్కువ గల ప్లాస్టిక్ కవర్లను వాడిన మరియు విక్రయించిన
భారత ప్రభుత్వ పర్యావరణ, అటవి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జీఎస్ఆర్ నెంబర్ 571(బీ) ప్రకారం 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్లాసులు,తదితర వస్తువులు విక్రయించిన, నిల్వచేసిన రూపాయలు 1,000 నుండి 25,000 వరకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకొంటామని తెలియజేశారు. వ్యాపార సంస్థల నిర్వాహకులు తమ వ్యాపార కార్యకలాపాలతో వెలువడిన చెత్తను దుకాణాల వద్దనే తడి, పొడి, హానికార చెత్తగా వేరు చేసి షాపు వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలకు స్వయంగా అందించాలని తెలియజేశారు, లేనిచో ఎస్ డబ్ల్యూ ఎం -2016 చట్టం ప్రకారం జరిమానా విధించబడుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు