నెల్లూరు
కోర్టు ఆదేశాలు దిక్కరించి తన సొంత నిర్ణయాలతో విధులు సాగిస్తున్న ఇందుకూరుపేట మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ పై విచారణ జరిపించి చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకోవాలని లాయర్ సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం, కొరుటూరు పాలెం గ్రామంలో లో లో సెప్టెంబర్ నెల 10 న జరిగిన వినాయక చవితి ఊరేగింపు అనంతరం సుమారు 12 గంటల సమయంలో ఒకే కుటుంబానికి చెందిన రెండు దాయాదుల వర్గాలకు చెందిన బంధువులు ఘర్షణ పడ్డారని తెలిపారు. ఈ విషయమై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగింది అన్నారు. అయితే ఒక వర్గానికి చెందిన 15మంది నిరుపేద మత్స్యకారులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. సదరు 15 మంది మత్స్యకారులు ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించగా స్పెషల్ జడ్జి ఫర్ ట్రైలర్ అపెన్సస్ అండర్ ఎస్సీ అండ్ ఎస్ టి యాప్ కం 5వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి ఈ నెల 8 న క్రైమ్ నెంబర్ 824/2021 ఆర్డర్ నందు ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన158/2021న ముద్దాయి అయిన 15 మందికి41( ఎ) సి ఆర్ పి సి ప్రకారం వారి ఓకే సమక్షమున నోటీసులు జారీ చేయమని సదరు పోలీసులను సూచించడం జరిగిందని తెలియజేశారు. సదర్ అదుర్స్ కాఫీతో మత్స్యకారుల ముద్దాయిల తరఫున వకీలు నేను స్టేషన్ కు వెళ్లగా అక్కడ అ ఎస్ఐ శ్రీనివాసులు స్టేషన్లో లేరని కానిస్టేబుల్స్ చెప్పడం జరిగిందన్నారు. ఈ విషయమై ఎస్సై తో ఫోన్లో సంభాషించగా నోటీసులు ఇచ్చే ప్రసక్తే లేదని తాను ముద్దాయి అయిన 15 మంది మత్స్యకారులను అరెస్టు చేయడం తప్పదన్నారని చెప్పడం జరిగిందన్నారు. ఈ విధంగా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే తమను భయాందోళనకు గురి చేస్తున్నాడని, తమకు పాత నేరచరిత్ర అంత కట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ముద్దాయిల తరపున ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రోజువారి కూలీలైన మత్స్యకారుల తరపున ఇచ్చిన కోర్టు ఆదేశాలు అధికారులకు పాల్పడుతున్న ఎస్ఐ శ్రీనివాసులు పై విచారణ జరిపించి, చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో బాధిత ముద్దాయిలు మరియు గ్రామ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ కోర్టు ఆదేశాలు ధిక్కారానికి పాల్పడుతున్న ఎస్సై పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి లాయర్ సురేష్ కుమార్...