బెల్లంపల్లి అక్టోబర్ 18
జాతీయ న్యాయ సేవాది కార సంస్థ,తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో, సోమవారం భీమిని మండల మల్లిడి, అక్కలపల్లి, ఖర్జి భీంపూర్, వడాల గ్రామాలలో బెల్లంపల్లి మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు, అవగాహన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిప్ప మనోహర్, భీమిని ఎసై కొమురయ్య లు మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న ఇబ్బందులపై పోరాటం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది సమాజంలో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అందులో కొన్ని చట్టాలు, దిశా చట్టం, 354 ఐపిసి, వాహనదారుల చట్టం,, భారత రాజ్యాంగం ,సమాచార హక్కు చట్టం, స్పోర్ట్స్,,లీగల్ సర్వీస్ అథారిటీ, వాల్టా చట్టం,498ఏ, డివిసి ,354,మహిళా చట్టాలు,గిరిజన చట్టాలు, బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అని ,పలు చట్టాలపై అవగాహన కల్పించారు..ఈకార్యక్రమంలో న్యాయవాదులు,ఎల్ రాము, సింగతి రాజేష్ దాసారపు రాజు, గజం అనిల్ కుమార్ ,సునీల్ ,సబ్బని సాయి కుమార్ , సింగతి రాజేష్ ,గజం అనిల్ కుమార్ , రంగ ప్రశాంత్, మల్లిడి సర్పంచ్ బలగం సంతోష్ లు తదితరులు పాలుగొన్నారు.