చిత్తూరు
చిత్తూరు జిల్లా తవణం పల్లి మండలం మడవనెరి గ్రామ సమీపంలో పంట పొలాల్లో తరచు అటవీ జంతువులు దాడి చేసి పంటనష్టం కలిగిస్తుండడంతో స్థానికులు కొంతమంది అడవి జంతువులకోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో ఒక చిరుతపులి తల చిక్కుకోవడంతో ఉచ్చులో చిక్కిన చిరుత గిలాగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది. అడవి పందుల నుంచి తమ పంటలను కాపాడుకునే క్రమంలో కొంతమంది తమ పంటపొలాల వద్ద అక్కడక్కడ ఉచ్చుని ఏర్పాటు చేసుకోవడంతో ఆటవీప్రాంతం నుంచి వచ్చిన చిరుత చిక్కుకొని తన ప్రాణాలను వదిలింది…ఉచ్చులో చిరుత తగులుకుని చనిపోయిన విషయాన్ని స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు..సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు…అనంతరం తవనంపలి మండల డీఎఫ్వో మాట్లాడుతూ కొంతమంది వేతగాళ్ళు ద్విచక్ర వాహనం క్లచ్ వైర్ తో ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుతపులి తల తగులుకోవడంతో పులి తపోయించుకోలేక మరణించిందని నిర్ధారించారు..పులి గోర్లు,ఇతర అవయవాలు అలాగే ఉన్నాయని త్వరలోనే వేటగాళ్లను పట్టుకుంటామని తెలిపారు