కామారెడ్డి
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రం శివారు లోని మంజీర పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్న ఇసుక క్వారీల్లో బుధవారం రాత్రి చిరుత పులి సంచరించింది దీంతో క్వారిలో పని చేస్తున్న కొంతమంది వ్యక్తులు దూరం నుండే గమనించి తమ సెల్ ఫోన్లలో చిరుత ఫోటోలను బంధించారు ..దీంతో చిత్రాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.. సుమారు 20 రోజుల పైబడి చిరుత మండల కేంద్రంతో పాటు ఆయాగ్రామలలో సంచరిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు పులిని బంధించడం లో విఫలమయ్యారు.. దీంతో మండల ప్రజలు ఎప్పుడు ఎవరి పై చిరుత దాడి చేస్తుందని బిక్కుబిక్కుమంటూ రాత్రివేళలో బయట తిరుగుతున్న. చిరుత పులి పంట పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్న రైతులు. గత వారం రోజుల క్రితమే రెండు బోన్ లను ఆటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసారు.