నెల్లూరు
ప్రజాలందరీ ఆరోగ్య భద్రతే లక్ష్యంగా,స్వచ్ఛ వెంకటగిరి – స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ ,దిశగా అడుగేద్దాం అని వెంకటగిరి నియోజకవర్గ అ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి వర్యులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు రూపకల్పన చేసిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా, సోమవారం వెంకటగిరి పట్టణం నందు మున్సిపల్ శాఖ వారి సహకారంతో,40 లక్షల ప్రభుత్వ నిధులతో,ప్రతి ఇంటికి 3 చెత్త బుట్టల (తడి చెత్త, పొడి చెత్త, గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలు) పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని ప్రతి కుటుంబానికి, చెత్త బుట్టల పంపిణీకి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత, క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం ప్రాంతాలలో స్వచ్ఛ వెంకటగిరి కి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇందులో భాగంగానే ఈ నియోజకవర్గం పరిధిలోని వెంకటగిరి పట్టణంలో పలు ప్రాంతాలలో కాగితాలు , తిను బండారాల వ్యర్ధాలు , చాక్లెట్స్ మరియు బిస్కెట్స్ ప్యాకేజీ వ్యర్థాలను విద్యార్థుల ద్వారా తొలగించారు.