Home తెలంగాణ మ‌ట్టి గ‌ణ‌ప‌తుల‌ను ప్ర‌తిష్ఠించుకుందాం: హరీష్ రావు

మ‌ట్టి గ‌ణ‌ప‌తుల‌ను ప్ర‌తిష్ఠించుకుందాం: హరీష్ రావు

91
0

హైద‌రాబాద్ సెప్టెంబర్ 9
వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌తి కుటుంబం మట్టి గణపతి ప్రతిమల‌ను ప్రతిష్ఠించుకోని ఇంటిల్లిపాది వేడుకగా పూజించుకోవాల‌ని హ‌రీశ్‌రావు సూచించారు. ప్రకృతిని దేవుని రూపంలో పూజించే గొప్ప పండగ అని, మట్టి గణపతినే పూజించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్రకృతి సిద్దమైనటువంటి పత్రులు, పూలదండలతో పూజిద్దాం. ప్లాస్టిక్ పూలు, దండలు వద్దు, నిమజ్జనం సమయంలో చెరువులలో, వాగులను ప్లాస్టిక్ రహితంగా ఉంచుకొని పర్యావరాన్ని సంరక్షించుకుందామని పిలుపునిచ్చారు. మన అందరిపై విఘ్నేశ్వ‌రుని అనుగ్రహము ఉండాలని కోరుకున్నారు. ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి హ‌రీశ్‌రావు ఆకాంక్షించారు.ఏ కార్యం చేయాల‌న్న‌ తొలి పూజ ఆరాధన విఘ్నేశ్వరునికే చేస్తామ‌న్నారు. అన్ని విఘ్నలు తొలగి అన్ని కార్యాలు సిద్దించాలని ఆ గణనాథుణ్ణి ఆయన ప్రార్ధించారు. కరోనా మహమ్మారి అనే విఘ్నం తొలగాలని కోరుకున్నారు. ఆ విఘ్నేశ్వరుని దీవెనతో మనం చేసే కార్యాలు నిర్విఘ్నంగా సాగాల‌ని ఆకాంక్షించారు.

Previous articleమండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం ఏర్పాటు
Next articleముగిసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here