నంద్యాల నవంబర్ 26
నంద్యాల పురపాలక సంఘాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దాం అని నంద్యాల పురపాలక సంఘ చైర్మన్ షేక్ మాబున్నిషా అన్నారు
శుక్రవారం నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమీక్ష సమావేశ భవనంలో నంద్యాల పురపాలక సంఘ చైర్మన్. షేక్ మాబున్నిషా.నంద్యాల పురపాలక సంఘ వైస్ చైర్మన్ లు గంగిశెట్టి నాగ వెంకట శ్రీధర్. పాంషావలి .లతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమీక్షా సమావేశంలో పురపాలక సంఘం కమిషనర్ వెంకట కృష్ణ . ఇంజనీర్లు విజయ భారతి రెడ్డి. మధు. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మున్సిపల్ కోఆప్షన్ మెంబర్లు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నంద్యాల పురపాలక సంఘ చైర్మన్ షేక్ మాబునిషా మాట్లాడుతూ నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈషాక్ భాషా గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నందుకు గాను నంద్యాల కౌన్సిల్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపింది. నంద్యాల పట్టణంలో చిన్నపాటి వర్షాలకు పొంగిపొరలే శ్యాం కాలువ ను శ్యామ్ నగర్ లోని ప్రజలు పట్టణంలోని కి రావాలంటే చాలా ఇబ్బంది పడేవారని ఇది గమనించిన మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వానికి తెలుగు పెండింగ్లో ఉన్నటువంటి శ్యామ్ కాలవ బిడ్జి ని త్వరితగతిన పూర్తి చేసినందులకు నంద్యాల పురపాలక సంఘ కౌన్సిల్ వారందరి తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని అన్నారు. ఈరోజు జరిగిన సమావేశంఅజండా లో అన్నిటికీ ఆమోదముద్ర వేయడం జరిగింది అన్నారు.ఈరోజు జరిగిన సమావేశంలో కొంతమంది కౌన్సిలర్లు . జై నాభి. అబ్దుల్ మజీద్ .వెంకటలక్ష్మి శ్యామ్ సుందర్ లాల్. కో ఆప్షన్ మెంబర్. సుబ్రమణ్యం. తదితరులు మాట్లాడుతూ మన నంద్యాల పట్టణంలో .పట్టణంలో మురుగు కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో డెంగ్యూ .కోవిడ్ వ్యాధులు ప్రబలుతూనే ఉన్నాయి వీటి పై చర్యలు తీసుకోవాలని కోరారు.ఇంకా కొంత మంది కౌన్సిలర్లు మాట్లాడుతూ నంద్యాల పురపాలక సంఘం లో పారిశుద్ధ్య కార్మికులను ఇంకా అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలో ఉదయం .సాయంకాల.సమయంలో ఫాగింగ్ చేయించాలని కోరినారు. నంద్యాల పట్టణంలో కొన్ని వార్డుల్లో రెండు రోజులకు ఒకసారి త్రాగు నీటిని వదులుతున్నారు అని అలా కాకుండా ప్రతిరోజు త్రాగునీటిని రాత్రి పూట కాకుండా పగటి పూట నేత్రాగు నీటిని వదలాలి అన్నారు 27 వ వార్డు లో ఉన్న పాఠశాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయించాలని పాఠశాలకు ప్రహరీ గోడను ఎత్తు పెంచి నిర్మించాలని పాఠశాలలో తాగునీటి కొరత ఉన్నది ఇందులో దగ్గరగా ఉన్న బోరుకు మోటార్ ను బిగించి పాఠశాలకు నీటి సరఫరా ఏర్పాటు చేయాలని. మా వార్డులో 16. నిలిచిపోయాయి వాడిని పరిశీలించాలని. 12వ వార్డు లో మెటల్ రోడ్లు ఉన్నాయని. లాలీ కాలువలు కూడా ఏర్పాటు చేయించాలని పారిశుద్ధ్య సిబ్బంది చే రోడ్లను శుభ్రం చేయించాలని వార్డులో కోతుల బెడద. కుక్కల బెడద ఎక్కువగా ఉన్నది వాటిపై కూడా దృష్టి సారించాలని. 27వ వార్డులో వీధి దీపాలు సరిగ్గా వెలుగడం లేదు వాటిని సరి చేయించాలని కౌన్సిలర్ లు కోరినారు. అదేవిధంగా సంబందిత అధికారుల తో మాట్లాడి వీలైనంత త్వరలో పరిష్కారం చేస్తామని ఆమె అన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ నంద్యాల పురపాలక సంఘాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దాం నంద్యాల పురపాలక సంఘ చైర్మన్ ...