నెల్లూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనలు సలహాల మేరకు అందరం కలిసికట్టుగా పని చేద్దామని జిల్లా పంచాయతీ అధికారిని ఎం. ధనలక్ష్మి పిలుపునిచ్చారు. స్థానిక మనుబోలు మండల కేంద్రంలో ఉప సర్పంచ్ ,వార్డు సభ్యుల శిక్షణా ఈ కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీల అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి అవసరమగు నిధులు సమకూర్చుకొని, పంచాయతీలను సమృద్ధిగా అభివృద్ధి చేసుకొనుటకు గ్రామ ప్రజలతో కలిసి అభివృద్ధి పనులను చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ గండ వరం వెంకటేశ్వర్లు, కోఆప్షన్ సభ్యులు ఎస్కే జిలానిబేగ్ ,మౌలా భాష , ఎస్. కె యాసదని.రామ్మోహన్, పి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.