Home తెలంగాణ బ్లాక్ ఫంగస్ తోబాధపడుతున్న వ్యక్తికి మన చారిటబుల్ ట్రస్ట్ చేయూత

బ్లాక్ ఫంగస్ తోబాధపడుతున్న వ్యక్తికి మన చారిటబుల్ ట్రస్ట్ చేయూత

119
0

రాజన్న సిరిసిల్ల

వేములవాడ పట్టణంలోని 20 వార్డుకు చెందిన కోరెపు క్రాంతి గత కొద్ది రోజుల నుండి బ్లాక్ ఫంగస్ తో బాధపడుతున్నాడని తెలిసికొని మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆదుకోవడానికి ఇంతకు ముందే రావడం జరిగిందని అన్నారు . వీరి దగ్గరికి వెళ్లి మీకు ఏ విధమైన సహాయం కావాలని అడిగి తెలుసుకుంటే మా దగ్గర మందులకు డబ్బులు లేవు , మందులు కావాలని అని మమ్మల్ని కోరారు . ఈ మందులకు ట్రస్ట్ సభ్యులని మందులకు 14 , 000 వెల రూపాయలు   అవుతాయని అడగ్గానే నాతో పాటు 5 గురు సభ్యులు వెంటనే స్పందించి వీటితో మందులు తెప్పించామని , మందులకు సేవా దృక్పథంతో ముందుకు వచ్చి సహకరించిన నా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు . సభ్యులు అందించిన ఆర్థిక సహాయంతో బుధవారం  మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెల రోజులకు సరిపోయే మందులు , నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు . ఈ మందులు వాడుకొని క్రాంతి ఆరోగ్యం కుదుటపడాలని ఆ రాజేశ్వరుడిని వేడుకుంటున్నామని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో మోటూరి మధు , కొమ్మ నటరాజు , కట్ట శ్రీనివాస్ , విశ్వనాథుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Previous articleవివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
Next articleజాతీయస్థాయి టగ్ అఫ్ వార్ పోటీలకు ఎంపిక అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా యువకులు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here