Home తెలంగాణ స్వచ్ఛ మున్సిపాలిటీ గా తీర్చిదిద్దుదాం మున్సిపల్ కమిషనర్ గలిపెల్లి స్వరూప రాణి...

స్వచ్ఛ మున్సిపాలిటీ గా తీర్చిదిద్దుదాం మున్సిపల్ కమిషనర్ గలిపెల్లి స్వరూప రాణి జగిత్యాలలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం

76
0

జగిత్యాల సెప్టెంబర్ 30
జగిత్యాల మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీ గా తీర్చిదిద్దుదాం ఆని జగిత్యాల
మున్సిపల్ కమిషనర్ గలిపెల్లి స్వరూప రాణి ఆన్నారు. గురువారం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో 2 వ రోజు సర్వజానిక్ శౌచాలయ సఫై జన్ భగీదరీ అమృత్ ఉత్సవ్ కార్యక్రమంలో  భాగంగా జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్స్ లోని కేర్ టెకర్స్ కు మరియు మహిళలకు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం పై మున్సిపల్ కమిషనర్ గలిపెల్లి స్వరూప రాణి అవహగాన కల్పించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ పట్టణంలోని పబ్లిక్ టాయిలెట్స్ ను ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలని కొరారు. పబ్లిక్ టాయిలెట్స్ పరిశుభ్రత పై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని అందుకు గాను పట్టణంలోని పబ్లిక్ టాయిలెట్స్ కేర్ టెకర్స్ కు మరియు మహిళ సంఘ సభ్యులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.అలాగే పట్టణంలో కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను కమీషనర్ పర్యవేక్షించి, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ సెంటర్లను సద్వినియోగపరచుకోవాలని ఆన్నారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ వెంట డి.ఈ రాజేశ్వర్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాము, మహిళ సంఘం సిబ్బంది ఉన్నారు.

కోరుట్లలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2వ రోజు కోరుట్ల మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలోని కల్లూర్ రోడ్ పబ్లిక్ టాయిలెట్‌ లోని కేర్ టెకర్స్ కు మరియు మహిళలకు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం పై మున్సిపల్ కమిషనర్ ఎండి అయాజ్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పబ్లిక్ టాయిలెట్ కేర్‌టేకర్స్ కు సన్మానం చేశారు.అలాగే క్యూఆర్ కోడ్‌ల ద్వారా పబ్లిక్ టాయిలెట్ డిజిటల్ పర్యవేక్షణ అప్లికేషన్‌ల డౌన్‌లోడ్ డ్రైవ్‌ పై  అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పట్టణంలో కాలుష్య నివారణకు సహకరించాలని కమీషనర్ కోరారు.
పరిశుభ్రత లక్ష్యంగా ముందుకు సాగాడానికి పట్టణ ప్రజలు భాగస్వామ్యలు కావాలని పిలుపునిచ్చారు.పట్టణ ప్రజలు తడి ,పోడి చెత్త వేరే చేసి మున్సిపల్ వాహనానికి ఇచ్చి సహకరించాలని కమీషనర్ కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తోపాటు, సానిటరీ  ఇన్స్పెక్టర్ డి. గజానంద్ , హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్,ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, మునిసిపల్ సిబ్బంది, ఆప్పీ లు,ఎస్ హైచ్ జీ  సభ్యులు పాల్గొన్నారు.

Previous articleఆకట్టుకుంటున్న దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్ …
Next articleప్రాణాలు పోయిన ఆవయవాలు దానం చేసిన సదయ్య డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here